calender_icon.png 14 February, 2026 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందులో 68.56 శాతం పోలింగ్

12-02-2026 12:00:00 AM

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ 

ఇల్లందు, ఫిబ్రవరి 11,(విజయక్రాంతి): ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 33,723 ఓట్లకు 23,121 ఓట్లతో 68.56 శాతం పోలింగ్ నమోదైంది. 24 వార్డులకు గాను 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుండి పోలింగ్ బూతుల వద్ద జనాలు బారులు తీరకుండానే వచ్చి ఓట్లు వేసి వెనుతిరిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇల్లందు డిఎస్పి యు వెంకన్న బాబు పర్యవేక్షణలో ఇల్లందు,

టేకులపల్లి సీఐలు తాటిపాముల సురేష్, బత్తుల సత్య నారాయణ, ఎస్‌ఐ లు, సిబ్బందితో భారీ బందోబస్తు చేపట్టారు. అదేవిదంగా పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజు పరిశీలించి పోలింగ్, బందోబస్తు గురించి ఇల్లందు డిఎస్పి ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, జనాలు గుంపులు గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.