ముషీరాబాద్‌లో జోరుగా చేపల విక్రయాలు
08-06-2026 01:38 AM
మృగశిర కార్తె సందర్భంగా కిటకిటలాడిన చేపల మార్కెట్
ముషీరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): మృగశిర కార్తెను పురస్కరించుకొని నగరంలోనే అతి పెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్లో ఆదివారం చేపల అమ్మకాలు జోరుగా కొనసాగాయి. తెల్లవారుజాము రెండు గంటల నుంచి కొనుగోలుదారులతో మార్కెట్ కిటకిటలాడింది. బొచ్చ, రవ్వ పెద్ద సైజులో ఉన్న చేపలు కిలో రూ.150 నుంచి రూ. 200కు విక్రయించారు. కొర్రమీను కిలో రూ. 500 నుంచి రూ. 650కి విక్రయించారు. మృగశిర కార్తె సోమవారం అని ప్రకటించినప్పటికీ ఆదివారం మార్కెట్‌కు పెద్ద ఎత్తున చేపలు దిగుమతి అయ్యాయి. దీంతో ముషీరాబాద్ చేపల మార్కెట్ అంతా కొనుగోలుదారులతో కిటకిటలాడింది.






