తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారం
కలెక్టర్ నారాయణరెడ్డి
రంగారెడ్డి, ఆగస్టు 3 (విజయక్రాంతి): తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారమని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ కార్యాలయం అవరణ లో ఆయన మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని, మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే అందించాలని సూచించారు. ఇవి బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నారు. ఈ నెల 7 వరకు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్మయి, జిల్లా సంక్షేమ అధికారి శాంతి శ్రీ, వైద్య అధికారి స్వర్ణలత పాల్గొన్నారు.






