బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక
రంగారెడ్డి, ఆగస్టు 3 (విజయక్రాంతి): బోనాల పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబమని తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ లు అన్నారు.
సోమవారం కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయ కమిటీలకు ప్రభుత్వం మంజూరు చేసిన బోనాల నిర్వహణ చెక్కులను వారు అందజేశారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బోనాల ఉత్సవాల వైభవానికి ప్రాధాన్యతనిస్తూ ఆలయాలకు నిధులు విడుదల చేసిందని తెలిపారు. చెక్కుల పంపిణీ అనంతరం నాయకులు కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం లో ఈవో శోభన్ బాబు, మాజీ కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, వజీర్ ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






