4 July, 2026 | 9:28 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్

04-07-2026 08:03 PM

నస్పూర్,(విజయక్రాంతి): వారణాసిలో జరిగిన CMPF బోర్డు సమావేశంలో BMS ప్రతినిధులు కె లక్ష్మారెడ్డి, ఆశిష్ మూర్తిలు కార్మికుల సంక్షేమం, CMPF వ్యవస్థ బలోపేతం, పారదర్శకతకు సంబంధించిన పలు కీలక అంశాలపై యాజమాన్యాన్ని నిలదీసినట్లు శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాతాడి శ్రీధర్ రెడ్డి, ఏరియా సెక్రటరీ రాజారాం కిరణ్ కుమార్ శని వారం వెల్లడించారు. CMPF బోర్డు సమావేశంలో పెన్షన్ ఫండ్ స్థిరత్వంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

CMPF రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం వల్ల అనేక కీలక నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని, కమిషనర్‌ను వెంటనే నియమించాలని, CMPF అడ్వాన్స్‌ల కోసం ఉద్యోగులు అనవసరంగా పలు పత్రాలు సమర్పించాల్సిన పరిస్థితిని తొలగించి, స్వీయ ధృవీకరణ (Self-Declaration) ఆధారంగా అడ్వాన్స్‌లను మంజూరు చేసే విధానాన్ని అమలు చేయాలని కోరారు. సుమారు 6.5 లక్షల మంది పెన్షనర్లకు సంబంధించిన సేవలను సులభతరం చేయడానికి ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

CMPF నిధులకు కస్టోడియన్‌గా డచ్ బ్యాంక్ (Deutsche Bank) అనే విదేశీ బ్యాంకును కొనసాగిస్తున్నారని, భారతదేశంలోని EPF వంటి సంస్థల నిధులు భారతీయ బ్యాంకుల ద్వారానే నిర్వహించబడుతున్నప్పుడు, CMPF నిధులను మాత్రం విదేశీ బ్యాంకు కస్టడీలో ఉంచడంలో ఆంతర్యం ఏమిటని, భారతీయ బ్యాంకుకు మార్చకుండా అడ్డుకునే నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అని యాజమాన్యాన్ని ప్రశ్నించారన్నారు. ఈ అంశాలపై వామపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని ప్రశ్నించడంలో ముందుకు రాకపోవడం విచారకరమన్నారు.