17 March, 2026 | 11:20 AM

రక్తదానం ప్రాణదానంతో సమానం

17-03-2026 02:00 AM

కలెక్టర్ చాహత్ బాచ్ పాయ్

హనుమకొండ, మార్చి 16 (విజయ క్రాంతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ తరచుగా రక్తదానం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాచ్ పాయ్ కోరారు. హనుమకొండ కలెక్టరేట్ లోని జిల్లా ఖజానా శాఖ కార్యాల ప్రాంగణంలో   సోమవారం జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులను కాపాడేందుకు రక్తదాన శిభిరం నిర్వహించారు. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఆరోగ్యంగా జీవించడానికి తరచూ రక్త మార్పిడి అవసరం అవుతుందనీ, వారికి రక్తం అనేది కేవలం అవసరం మాత్రమే కాదు, అది నిజంగా వారి ప్రాణాధారం అన్నారు.

ఈ సందర్భంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు అవసరమైన వారికి సమయానికి రక్తం అందేలా చూడడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందన్నారు.ఈ రక్తదాన శిబిరం లో హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు  పుల్లూరు వేణుగోపాల్,

బిళ్ళ రమణారెడ్డి, జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్, టి. ఎన్. జి. ఓ. ప్రెసిడెంట్ ఆకుల రాజేందర్, టి. జి. ఓ. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్ మోహన్ రావు, బైరి సోమయ్య, డా. ప్రవీణ్, రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, కోలా రాజేష్ కుమార్, మాధవ రెడ్డి, లక్ష్మి ప్రసాద్, విజయలక్ష్మి, కిరణ్, శ్యామ్ సుందర్, ఫణికల రాజేష్, యం. ఆర్. ఓ లు  బావు సింగ్, జగన్ మోహన్ రెడ్డి, ఖజానా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.