ఎల్లంపేట 9వ వార్డులో రక్తదానం
11-08-2026 12:24 AM
మేడ్చల్, ఆగస్టు 10 (విజయ క్రాంతి ):ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని 9 వ వార్డులో ఈ. సాయికుమార్ మొదటి వర్ధంతి సందర్భంగా సీమర్ గ్రూప్ సహకారంతో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ రజిత రాజేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
బిఆర్‌ఎస్ సీనియర్ నేత రాజేంద్ర రక్తదానం చేసి మాట్లాడుతూ రక్త దానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రక్తదానం వల్ల ఎదుటి వారికి సహాయం చేసిన వారిమి అవుతామని, రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవని రాజేంద్ర పేర్కొన్నారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాజేంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






