calender_icon.png 8 February, 2026 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెక్ బయో విప్లవానికి వేదికగా బయో ఆసియా

08-02-2026 12:00:00 AM

17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు సదస్సు

ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) : ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులకు దిశానిర్దేశం చేయనున్న ఆసియాలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఫోరం బయో ఆసి యా -2026 మరోసారి హైదరాబాద్‌ను ప్రపంచ దృష్టికి కేంద్రంగా మార్చుతోంది. ‘టెక్ బయో అన్‌లీష్డ్, ఏఐ, ఆటోమేషన్ ది బయాలజీ రివల్యూషన్’ అనే థీమ్‌తో ఈనెల 17--, 18 తేదీల్లో జరగనున్న ఈ రెండు రోజుల సదస్సుకు ప్రపంచ శాస్త్రవేత్తలు, ఏఐ నిపుణులు, పరిశ్రమ సీఈఓలు, విధాన రూపకర్తలు ఒకే వేదికపైకి రానున్నారు.

ఏఐ--ఆధారిత జీవశాస్త్రం, తదుపరి తరం మందులు, డిజిటల్ -ఫస్ట్ హెల్త్ కేర్ మోడళ్ల ద్వారా ప్రపంచ ఆరోగ్య భవిష్యత్తును ఎలా రూపకల్పన చేయాలనే అంశంపై బయో ఆసియా- 2026 కీలక చర్చలకు వేదిక కానుంది. జీవశాస్త్రం మరింత ప్రోగ్రామబుల్ అవుతున్న తరుణంలో, పరిశోధ న, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ), తయారీ ప్రక్రియలను ఏఐ వేగవం తం చేస్తున్న వేళ, టెక్ బయో మోడల్ ఇక భావన స్థాయిలో కాకుండా అమలు దశలోకి ప్రవేశించింది.

ఈ మార్పుకు నాయకత్వం వహిస్తున్న గ్లోబల్ ఇన్నోవేటర్లను ఒకచోట చేర్చడంలో బయోఆసియా-2026 కీలక పాత్ర పోషిస్తోంది. బయో ఆసి యా 2026 ప్రారంభ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభోపన్యాసాలు ఇవ్వనున్నారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్--5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దాలన్న తెలంగాణ ప్రభుత్వ దీర్ఘకాలిక సంకల్పాన్ని వారు మరోసారి పునరుద్ఘాటించనున్నారు.  

తెలంగాణ రైజింగ్ విజన్ -2047

బయోఆసియాలో భాగంగా జరిగే ప్రత్యేక ‘తెలంగాణ రైజిం గ్’ సెషన్‌లో ఏఐ ఆధారిత ఆర్ అండ్ డీ, అడ్వాన్స్‌డ్ బయో మాన్యుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్ -డ్రివెన్ గ్రోత్ అంశాలపై రాష్ట్ర రోడ్‌మ్యాప్‌ను వివరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్ బయో దిశను నిర్ణయిస్తున్న డా. స్టీఫన్ మిల్టెనీ, డా. హోవార్డ్ వై.చాంగ్, పుష్మీత్, మడేలిన్ రోచ్, ఆంటన్ గ్రూమ్, డా.డెస్పినా సోలోమోనిడౌ, రష్మి కుమార్, ఈమోన్, బధ్రి శ్రీనివాసన్ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు.

సైన్స్ సాఫ్ట్‌వేర్‌ను స్కేల్ చేయడంలో అసలు సవాళ్లు, 2026---2030 మధ్య ఫార్మా, బయోటె క్ వృద్ధి దిశలు, నెక్స్ట్-జెన్ బయోలాజిక్స్, క్లినికల్ వాలిడేషన్, బయోమాన్యుఫ్యాక్చరింగ్‌లో ఏఐ పాత్ర వంటి అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. వీటితోపాటు ఏఐ ఆధారిత ఆర్‌అండ్ డీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, పేషెంట్ ఇంపాక్ట్ అంశాలపై లోతైన చర్చలు జరుగనున్నాయి. ప్రపంచ నాయకులు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, యువ ఆవిష్కర్తల సమన్వయంతో బయో ఆసియా 2026 భాగస్వామ్యం, పరిజ్ఞానం, పెట్టుబడి కోసం ఒక శక్తివంతమైన వేదికగా నిలవనుంది.