13 June, 2026 | 8:56 PM

అభివృద్ధి పనులకు భూమి పూజ

13-06-2026 07:27 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలో శనివారం కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగ్‌రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు. గుండంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే సిరిపూర్ గ్రామంలో మహిళా సంఘం డెవలప్‌మెంట్ కింద మూడు లక్షల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.