13 June, 2026 | 8:56 PM

బాసర త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన ఎక్సలెంట్ విద్యా కుసుమం

13-06-2026 07:24 PM

- మాకు మేమే సాటి మాకు లేరు ఎవరు పోటీ

- పోటీ పరీక్షలలో ముందువరుసలో ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విద్యార్థులు

- మొన్న పాలిసెట్లో 72వ స్టేట్ ర్యాంక్ సాధించిన త్రిశాంత్

- నేడు త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన డి. షణ్ముఖ ప్రియా

- విద్యార్థినిని సత్కరించి అభినందనలు తెలిపిన చైర్మన్ యూసఫ్ షరీఫ్

పినపాక,(విజయక్రాంతి): కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా..  విద్యార్థి పట్టుదల ఉపాధ్యాయుడి నాణ్యమైన బోధన ఈ రెండు కలిసిన వేళ లక్ష్యం తమ చెంతకు చేరుతుంది. దీనికి నిదర్శనమే ఎక్సలెంట్ భాషా హై స్కూల్ వ  ప్రతి పోటీ పరీక్ష లోను మాకు మేమే సాటి  మాకు లేరు ఎవరు పోటీ అని విజయాలను తమ ఖాతాలో వేసుకుంటున్న ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విద్యార్థులు. మొన్నటికి మొన్న పాలిసెట్లో త్రిశాంత్ స్టేట్ 72వ ర్యాంకు సాధించిన విషయం మరువక ముందే నేడు వెలువడిన త్రిబుల్ ఐటీ ఫలితాల్లో ఆర్ జి యు కె టి బాసరలో సీటు సాధించిన డి షణ్ముఖ ప్రియ.

ఆమెను అభినందించి ఘనంగా సత్కరించిన ఎక్సలెంట్ భాషా హై స్కూల్ చైర్మన్ యూసఫ్ షరీఫ్, డైరెక్టర్స్ ఖాదర్, గబ్బర్, బండారు నరేంద్ర, ముక్కు వెంకట నర్సారెడ్డి , ప్రిన్సిపల్ అంకం సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాసర త్రిబుల్ ఐటీ లో సీటు కోసం రాష్ట్రం నలుమూలల నుండి పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు వేల సంఖ్యలో పోటీ పడుతుంటారు. కారణం ఒక్కసారి ఇందులో సీటు సాధిస్తే ఆరు సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యాభ్యాసం పూర్తిచేసుకుని  ఉద్యోగం  సాధించే బయటికి వస్తారు అనేది అక్షర సత్యం.

పినపాక మారుమూల ప్రాంతంలో బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ  ఎక్సలెంట్ భాషా హై స్కూల్  యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు అనడానికి  పోటీ పరీక్షల్లో వరస ఫలితాలే  నిదర్శనం అనడంలో అతిశయోక్తి లేదు అని అన్నారు. ప్రతి పోటీ పరీక్షలో తమ విద్యార్థులను ముందు వరుసలో నిలబెడుతున్న ఎక్సలెంట్ భాషా హై స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు, పలువురు విద్యావంతులు ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు.