ఊపిరితిత్తుల సమస్యకు పరిష్కారం
17-07-2026 12:00 AM
నాలుగేళ్ల బాధ నుంచి విముక్తి కల్పించిన ‘మెడికవర్’
హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): నాలుగేళ్లుగా న్యుమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న ఖమ్మం జిల్లా, పెను బల్లి మండలం, మండలపాడు గ్రామానికి చెందిన సత్యం (60).. ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న దంతం, డెంటల్ ఫిక్సర్‌ను హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక ఫ్లెక్సిబుల్ బ్రోంకోస్కోపీ ద్వారా విజయ వంతంగా తొలగించారు.
సీటీ ఛాతీ స్కాన్లో కుడి ప్రధాన శ్వాసనాళంలో విదేశీ పదార్థాన్ని గుర్తించి, డోర్మియా బాస్కెట్ సహా యంతో తొలగించినట్లు పల్మనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ యశస్విని తెలిపారు. సెంటర్ హెడ్ స్వరూప్, మెడికల్ సూపరింటెండెంట్ డా. కిశోర్ పాల్గొన్నారు.






