15 June, 2026 | 9:41 PM

Breaking News

వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •  

డైవర్స్‌కు ముందు.. ఒక్క చాన్స్

27-04-2025 12:00 AM

దాంపత్య జీవితంలో గొడవలైనా, ఏ విషయంలోనైనా ఇద్దరి మధ్య తప్పులు జరగడం సహజం. విడాకులే ఏకైక పరిష్కారం అనుకుంటున్నారు ఈతరం దంపతులు. కానీ ఇలా వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకోవడం కంటే కాస్త ఓపిక వహించి రిపేర్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ‘ట్రయల్ సెపరేషన్’ పద్ధతి మేలంటున్నారు. భేదాభిప్రాయాలొచ్చిన జంటలు విడాకులు తీసుకోకుండా..

కొంతకాలం పాటు దూరంగా ఉండటమే ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వేర్వేరూ ఇళ్లలో నివసించవచ్చు. ఆర్థికంగా, ఇతర కారణాల రీత్యా అది కుదరకపోయినా.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో జీవనం కొనసాగించవచ్చు. సాధారణంగా ఇలా దూరమైతేనే ప్రేమలు పెరుగుతుంటాయి.

ట్రయల్ సెపరేషన్‌లోనూ ఇదే జరుగుతుందంటున్నారు నిపుణులు. ఇద్దరూ ఇలా విడిపోయి కలిసుండటం వల్ల భాగస్వామి విలువేంటో, వారిని ఎంతగా మిస్సవుతున్నారో తెలిసొస్తుంది. ఈ భావనలు ఇద్దరు కలుకునేందుకు దోహదం చేస్తాయంటున్నారు. ఈ పాజిటివిటీనే అనుబంధాన్ని తిరిగి కలుపుతుందని చెబుతున్నారు.