20-04-2025 12:00:00 AM
విద్యా సిన్హా 18 ఏళ్ల వయసులో మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించారు. అప్పట్లో తన సొగసుతో మిస్ బాంబే కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. బాలీవుడ్‌లో కొత్తతరం కథానాయికగా మంచి పేరు సాధించుకున్నారు. అంతేకాదు పక్కింటి అమ్మాయిలా అనిపిస్తూ గుర్తింపు పొందారు.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అనంతరం విద్య సినిమాల వైపు అడుగులు వేశారు. ‘రాజాకాకా’ అనే చిత్రం బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. ప్రముఖ డైరెక్టర్ బసు ఛటర్జీ 1974లో తీసిన ‘రజనీగంధ’, 1975లో ‘చోటీ సీ బాత్’ అనే సినిమాలతో ఆమె బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యారు. అదే ఏడాది అంటే 1975లోనే ‘పతి పత్ని ఔర్ ఓ’, ‘ముక్తి’ తో పాటు తదితర చిత్రాల్లో ఆమె నటించారు.
ఇక ఆమె చివరిగా బాలీవుడ్ కండల వీరుడు, బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ 2011లో నటించిన ‘బాడీగార్డ్’ అనే చిత్రంలో నటించారు. ఇలా ఆమె 30కి పైగా మూవీస్‌లో నటించి.. ప్రతి సినిమాలోనూ కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఆమె 1986లో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.
విద్యా సిన్హా 1968లో వెంకటేశ్వరన్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్నారు. వెంకటేశ్వరన్ చనిపోయిన తర్వాత నటనకు గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత కొంత కాలం తర్వాత నేతాజీ అనే డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. కొందరి రూపాలు కృత్రిమ అద్దకా లకు పనికిరావు. విద్యా సిన్హా రూపం విగ్గులూ వానపాటలూ డిస్కో దరువులకు అనువైనది కాదు.
అవి విజృంభించిన ఎనభైల కాలంలో ఆమెకు తగిన పాత్రలు రాలేదు. మొదటి బర్త 1996లో మరణించాడు. దత్త త తీసుకున్న అమ్మాయి పెంపకం ఆమెను సినిమాలకు దూరం అయ్యేలా చేసింది. రెండోసారి పెళ్లి కూడా వేదన మిగిల్చింది. సాధారణంగా ఇలాంటివి కొంతమంది అందరికీ చెప్పుకుంటారు. విద్యా సిన్హా ఏనాడూ నోరు మెదపలేదు.
విద్యా సిన్హా తన నటించిన సినిమాల్లో ఎక్కువగా సంప్రదాయ దుస్తులే ధరించిం ది. తన చీర కట్టుతో మధ్యతరగతి మహిళ గా కనిపించేది. అందుకే బాలీవుడ్‌లో ఆమె కు ‘పక్కింటి అమ్మాయి’ గా పేరొచ్చిం ది. ఆమె స్మార్ట్ వాచ్‌ను, సున్నితమైన బం గారు ఆభరణాలు ధరించి తెరపై చాలా అందంగా కనిపించేవారు. ఈమె ప్రముఖ నిర్మాత రాణా ప్రతాప్ సింగ్‌కు 1947 నవంబర్ 15న జన్మించారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతు 71వ ఏట కన్నుమూశారు.
యాదృచ్ఛిక మరణం..
దేశమంతా ఆగస్టు 15 వేడుకలను ఘ నంగా జరుపుకుంటున్నది. సినీ, రాజకీయ ప్రముఖులు తమ దేశభక్తిని చాటుతూ అభిమానులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభా కాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయం లో చిత్ర పరిశ్రమంలో ఒక చేదు ఘటనను కూడా గుర్తుచేసుకుంటున్నారు. అదేంటంటే.. విద్యా సిన్హా ఆగస్టు 15న కన్నుమూ శారు.
ఇందులో విశేషం ఏముంది అంటే.. ఆమె 1947.. అనగా స్వాతంత్య్రం వచ్చిన ఏడాది జన్మించారు.. విశేషమో.. యాదృచ్ఛికమో తెలియదు కానీ అదే ఇండిపెండెన్స్ డే రోజున కన్నుమూశారు. దీంతో ప్రతి ఏడాది ఇదే రోజు ఆమె గురించి చాలామంది తలుచుకుంటూ బాధపడతారు. సినీ అభిమానులకు లలితమైన జ్ఞాపకం విద్యా సిన్హా.