5 August, 2026 | 1:41 AM

రూ.5లక్షలతో వైఎస్‌ఆర్ పార్కు సుందరీకరణ

05-08-2026 12:49 AM

మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతాం:ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్,ఆగస్టు 4 (విజయక్రాంతి): ముషీరాబాద్ లోని వైఎస్‌ఆర్ పార్కును రూ.5 లక్షలతో మరింత సుందరీకరణ సంతరించేలా పనులు చేపడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. మం గళవారం ముషీరాబాద్ లోని వైఎస్‌ఆర్ పా ర్కులో చేపట్టిన అభివృద్ధి పనులను జీహెచ్‌ఎంసీ డీఈ గీతాకుమారి, ఉధ్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్, మేనేజర్ లతో కలిసి పార్కు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ  వైఎస్‌ఆర్ పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

పార్కులో పచ్చదనం, పాత్వే, పూలమొక్కలు, వాటర్ ఫౌంటేన్ ఆధునీకరణ తదితర పనులు త్వరిత గతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. తాము అభివృద్ధిపనులు చేపడుతుంటే ఇత ర పార్టీల నేతలు మేమే అభివృద్ధి పనులు చేపడుతున్నాం,  అధికారులకు మేమే విజ్ఞప్తులు, లేఖలు రాసామని ప్రచారం చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిత్యం బీఆర్‌ఎస్ నేతలు తాము ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామని తెలిపారు.

ప్రజలు వాస్తవాలను గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పార్కులో సందర్శకులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు దీన్ దయాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నియోజకవర్గం బీఆర్‌ఎస్ మీడియా సెల్ ఇన్చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, వైఎస్‌ఆర్ పార్కు కాలనీ నాయకులు ప్రేమలత రెడ్డి, సుఖన్య, సుబోధన్, నాయకులు రవి యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.