స్టైఫండ్ పెంచాలి
05-08-2026 12:50 AM
జూబ్లీహిల్స్,ఆగస్టు4(విజయక్రాంతి):గత పది సంవత్సరాలుగా తమకు స్టైఫండ్ పెంచడం లేదని తెలంగాణ ఆయుష్ హౌజ్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఆయుష్ హెచ్‌ఎస్ అండ్ పీజీ జేఏసీ) ఆరోపించింది.వెంటనే స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను మంగళవారం చేపట్టారు.
ఎర్రగడ్డలోని ఆయుర్వేద వైద్య కళాశాల ప్రాంగణంలో చేపట్టిన సమ్మెలో ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి, బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్, రామంతాపూర్ డా. జె.ఎస్.పి.ఎస్. ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల అండ్ ఆసుపత్రి,చార్మినార్ ప్రభుత్వ నిజామియా టిబి యునాని కళాశాల అండ్ ఆసుపత్రులకు చెందిన హౌస్ సర్జన్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






