calender_icon.png 8 February, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ షాక్

08-02-2026 01:15:10 AM

సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో డిమోషన్

బి కేటగిరీలోకి రోకో జోడీ

ముంబై, ఫిబ్రవరి 7 : భారత క్రికెట్ కం ట్రోల్ బోర్డు టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు భారీ షాకిచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే సెంట్ర ల్ కాంట్రాక్ట్ జాబితాలో వీరిద్దరూ డిమోషన్కు గురైనట్లు సమాచారం.  గతంలో విరాట్, రోహిత్ ఏ ప్లస్ కేటగిరిలో ఉండేవారు. తాజాగా ఆ కేటగిరిని పూర్తిగా రద్దు చేస్తూ.. రో-కోను బి కేటగిరిలోకి తరలించినట్లు ప్రచారం జరుగుతుంది. రో-కో టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మా త్రమే కొనసాగుతున్నారు.. 

బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్న వారికే అత్యుత్తమ కేటగిరి ఏ ప్లస్ లభిస్తుంది. రో-కో రెండు ఫార్మాట్ల నుం చి తప్పుకోవడంతో వారు బి కేటగిరిలోకి పడిపోయారు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం బయటపడింది. టీ20, టెస్టుల నుంచి తప్పుకున్న రో-కో ఏ ప్లస్ నుంచి బి కేటగిరికి పడిపోగా.. టీ20ల నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా మాత్రం ఏ కేటగిరి లోనే ఉన్నట్లు తెలుస్తుంది. జడ్డూతో పాటు  గిల్, ఆల్ ఫార్మాట్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఏ కేటగిరిలో ఉన్నారు.