బీజేపీ నేతకు బార్ అసోసియేషన్ సన్మానం
19-03-2026 01:18 AM
చేవెళ్ల, మార్చి 18 (విజయక్రాంతి): బీజేపీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన న్యాయవాది కృష్ణ గౌడ్ బుధవారం చేవెళ్ల ఆర్ అసోసియేషన్ అడ్వకేట్స్ కోర్టు ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పై పోరాడుతూ.. సమస్యల పరిష్కార దిశగా పని చేయాలని సూచించారు. అనంతరం కృష్ణ గౌడ్ మాట్లాడుతూ...పార్టీ బలోపేతంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానన్నారు. పార్టీ అభివృద్ధి, సామాజిక సేవల సమన్వయం చేస్తూ...ప్రజల విశ్వాసానికి వమ్ము చేయనని హామీ ఇచ్చారు.




