1 September, 2026 | 3:29 AM

కోట రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థి సత్తా

01-09-2026 01:26 AM

కరాటే ఛాంపియన్‌షిప్‌లో పవన్‌రాజ్‌కు ప్రథమ స్థానం

కరీంనగర్, ఆగస్టు 31 (విజయక్రాంతి): కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన 7వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో కరీంనగర్‌లోని కోట రెజో నేన్స్ జూనియర్ కళాశాల విద్యార్థి యు. పవన్‌రాజ్ ప్రతిభ చాటాడు. జూనియర్ 1617 కేటగిరీలో పోటీపడి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీ ల్లో వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా, పవన్‌రాజ్ అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచాడు.ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్‌లోని కోట జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కరాటే ఛాంపియన్‌షిప్‌లో ప్రథమ స్థానాన్ని సాధించిన పవన్‌రాజ్‌కు మెడల్, ట్రోఫీ, ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా సత్కరించారు.

కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి పవన్‌రాజ్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో కోట విద్యా ర్థి ప్రథమ స్థానాన్ని సాధించడం విద్యాసంస్థకు, తల్లిదండ్రులకు, కరీంనగర్‌కు గర్వకార ణమని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో రాణించేందుకు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఎంతో అవసరమని పేర్కొన్నారు.

కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. పవన్‌రానాజ్ సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరిన్ని కరాటే పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని డాక్టర్ అంజిరెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పవన్‌రాజ్‌ను అభినందించారు.