ఎన్టీఆర్ జయంతి వేడుకలు
నిర్మల్ మే 28 (విజయ క్రాంతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ చౌక్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్మల్ పట్టణ అధ్యక్షుడు సిరికొండ రమేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు సిధుగు భీమ్ రెడ్డి నిర్మల్ మండలం అధ్యక్షుడు బైరి వెంకన్న నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ గారు గండ్రత్ రమేష్ ఆకోజి కిషన్ రామకృష్ణ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు సమీకరణలు చేపట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహా వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఐటీడీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ గారిది అదేవిధంగా మహిళలకు సమాన హక్కు కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు






