24 May, 2026 | 1:26 AM

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

24-05-2026 12:00 AM

నాగోల్, మే 23 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బిఏఎంఎండి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ పాఠశాలలో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ రాష్ట్రస్థాయి క్రీడా వేడుకకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు హాజరయ్యారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిఏఎంఎండి అధ్యక్షుడు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీఏటి) ఉపాధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం సమాజాభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొంది స్తాయన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులకు అన్ని విధాలా సహకారం అందిస్తోందని తెలిపారు. ఈ ఛాంపియన్‌షిప్‌నకు విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 540 ఎంట్రీలు నమోదు కాగా, 453 మంది క్రీడాకారులు 28 విభాగాల్లో పోటీపడుతున్నారు. అండర్- అండర్ అండర్ అండర్ అండర్ విభాగాల్లో బాలురు, బాలికల కోసం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో  బిఏఎంఎండి ఖజాంచి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. వికాస్ హర్ష, జాయింట్ సెక్రటరీ నాగరాజు, సభ్యురాలు ఎస్కే రేష్మా, టోర్నమెంట్ చీఫ్ రిఫరీ సోహైల్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.