16 March, 2026 | 5:50 PM

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతాలు

16-03-2026 03:22 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెం సెక్టార్ పరిధిలోని కొత్త దొనబండ తండా అంగన్వాడి టీచర్ సంతోషి కుమారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్త దొనబండ తండా సర్పంచ్ బాణోతు అరుణా దేశ్ పాండు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీ మహిళలను ఆశీర్వాదించారు. 

అనంతరం మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రాల్లో అన్నప్రసన్న,అక్షరభ్యాసం, శ్రీమంతం, పుట్టిన రోజు వేడుకలు లాంటి కార్యక్రమాలను అంగన్వాడి సెంటర్లో నిర్వహించుకోవాలని, గ్రామ ప్రజలందరూ ఇలాంటి కార్యక్రమాల కు సహకరించాలని, గర్భిణీ స్త్రీలు,బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి సూచించారు.ఈ కార్యక్రమంలో కాల్వపల్లి తండా మాజీ సర్పంచ్ మాలోతు సుజాతసక్రు నాయక్, కార్యదర్శి నరేష్,డీలర్ మాలోతు లక్ష్మి, అంగన్వాడీ ఆయాలు, మహిళలు గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.