బాల్య వివాహాలపై అవగాహన
వాంకిడి, (విజయక్రాంతి): 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వాంకిడి మండలం పాటగూడ గ్రామంలో మంగళవారం బాల్య వివాహల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గ్రామ సర్పంచ్ శ్రీదేవి అధ్యక్షతన కమిటీ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేసి బాల్యవివాహాల నిరోధక కరపత్రాలను విడుదల చేశా రు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. కుమ్రం భీం
జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అడ్డు కోవాల్సిన బాధ్యత అంద రిపైనా ఉందన్నారు. బాలిక లకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు పూర్తయిన తర్వాతే వివాహాలు చేయాలని సూచిం చారు. బాలలపై జరిగే వేధిం పులు, పిల్లల భద్రత, విద్య, ఆరోగ్యంపై తల్లి దండ్రులకు బాలల హక్కులు, చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
బాల్య వివాహం జరుగుతు న్నట్లు తెలిస్తే వెంటనే 1098, 112, మహిళలపై జరిగే సమస్యలపై 181 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ పీతాంబర్, గ్రామ పటేల్, వార్డు మెంబర్, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






