క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..
లాపరోస్కోపిక్ అంకాలజీ సర్జరీతో మంచి ఫలితాలు
డాక్టర్ జి.దయాకర్ రావు సూచన
వనపర్తి టౌన్: అపెండిక్యులర్ మాస్, కోలస్ క్యాన్సర్(Colon cancer) వంటి సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి సరైన శస్త్రచికిత్స చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని మలక్ పేట యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జి. దయాకర్ రావు చెప్పారు. అత్యాధునిక లాపరోస్కోపిక్, అంకాలజీ సర్జరీతో మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన వివరించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎం వై ఎస్ బంకేట్ హాల్లో క్యాన్సర్ పై మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జి. దయాకర్ రావు మాట్లాడుతూ అపెండి క్యులర్ మాస్తో కూడిన కొలస్ క్యాన్సర్ కు అరుదైన చికిత్స యశోద ఆసుపత్రిలో విజయవంతంగా జరిగిందని చెప్పారు. వనపర్తి జిల్లాకు చెందిన 51 ఏళ్ల సూగురు యాదమ్మ తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, కడుపులో గడ్డతో యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిందని, పరీక్షల్లో అపెండిక్యులర్, మాస్తో పాటు కోలస్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారని చెప్పారు. కన్సల్టెంట్ జనరల్, లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ టి. సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రోగికి లాపరోస్కోపిక్ ఎక్స్పోరేషన్, అడ్హీజి యోలిసిన్, ఒమెంటల్ బయాప్సీ నిర్వహించారని తెలిపారు. అనంతరం డాక్టర్ దయాకర్ రావు పర్యవేక్షణలో రైట్ హెమి కోలెక్టమీ,ఐలీయో ట్రాన్స్వర్స్ అనాస్థమోషన్ శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. పెద్దప్రేగు భాగంలో గడ్డతోపాటు చుట్టుపక్కల భాగాలకు అంటుకుపోయిన ఇన్ఫ్లమేటరీ మార్పులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని చెప్పారు.
శస్త్ర చికిత్స అనంతరం రోగికి యాంటీబయోటిక్స్, నొప్పి నివారణ చికిత్స, డయాబెటిస్ నియంత్రణ, ప్రత్యేక పర్యవేక్షణ అందించారన్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం మెరుగుపడి స్థిరపడడంతో అవసరమైన సూచనలతో డిశ్చార్జ్ చేసినట్లు ఆయన తెలిపారు. అపెండిక్స్ లేదా పెద్ద ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్ తో కూడిన అపెండిక్యూలర్ మాస్ అనేది క్లిష్టమైన ఉదర సంబంధిత వ్యాధి అని, కడుపునొప్పి, జ్వరం, కడుపులో గడ్డ, జీర్ణ సమస్యల వంటి లక్షణాలతో ఇది కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. సమయానికి గుర్తించకపోతే ఇన్ఫెక్షన్ వ్యాప్తి, ప్రేగు అవరోధం, క్యాన్సర్ ముదిరే ప్రమాదం ఉంటుందని, ముందస్తు నిర్ధారణ, అత్యధునిక పరీక్షలు, సకాలంలో శస్త్ర చికిత్స అత్యంత కీలకమని చెప్పారు. అపెండిక్యులర్ మాస్తో కూడిన కొలస్ క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించడం, అత్యాధునిక లాపరో స్కోపిక్ పరీక్షలు, బయాస్పీ కి ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ చేయవచ్చన్నారు. క్లిష్టమైన కోలస్ క్యాన్సర్ కు విజయవంతమైన శస్త్ర చికిత్స నిర్వహణ, జీర్ణాశయ క్యాన్సర్కు మల్టీడిసిప్లినరీ వైద్య విధానానికి ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు.
కడుపునొప్పి, జ్వరం, కడుపులో గడ్డ వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు పరీక్షలు అవసరమని అన్నారు. అత్యాధునిక గ్యాస్ట్రోఇంటెస్టినల్, సర్జికల్ ఆంకాలజీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కేసు మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక గ్యాస్ట్రో ఇంటిస్టీనల్ సర్జరీ, సర్జికల్ అంకిలజీ సేవలు, సమగ్ర వైద్య సదుపాయాలను మరోసారి ప్రతిభంబించిందని అన్నారు. అపెండిక్యులర్ మాస్తో కూడిన కొలస్ క్యాన్సర్ వంటి క్లిష్టమైన ఉదర సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే ఖచ్చితంగా నిర్ధారించి అత్యాదునిక లాపరోస్కోపిక్, ఆంకాలజీ శస్త్ర చికిత్సల ద్వారా విజయవంతంగా చికిత్స అందించడం ఆసుపత్రి నైపుణ్యాన్ని చాటిచెప్పిందని తెలిపారు. అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందం, మల్టీ డిసిప్లినరీ వైద్య విధానాలతో క్లిష్టమైన క్యాన్సర్, జీర్ణాశయ సంబంధిత వ్యాధులకు కూడా సమర్థవంతమైన చికిత్స అందించగల సామర్థ్యం తమ ఆసుపత్రికి ఉందని ఆసుపత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కే.శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర లు తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో సురక్షితమైన, నాణ్యమైన, సమయోచిత వైద్య సేవలను అందించడంలో తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డీజీఎం లక్ష్మణా శ్రీకాంత్,ఏ.వాసు కిరణ్ రెడ్డి ఉన్నారు.






