విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన
25-07-2026 12:45 AM
అర్మూర్, జులై 24 (విజయక్రాంతి): మన కాలనీ మన భద్రత మన బాధ్యత అనే ప్రోగ్రాంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ప్రభుత్వ హాస్టళ్లలో ఎస్త్స్ర రజినీకాంత్ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల గురించి వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇందులో భాగంగా షీ టీమ్ లోగోలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు, కళాశాల, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






