కోర్టు ప్రాంగణంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు
25-07-2026 12:44 AM
వేములవాడ, జులై 24, (విజయ క్రాంతి): వేములవాడ జూనియర్ సి విల్ జడ్జి కోర్టు ప్రధాన ద్వారం వద్ద బీఆర్‌ఎస్ న్యాయవాదులు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనం గా నిర్వహించారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గుడిసె సదానందం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన లో కేటీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు నడిగోట్ల హరికృష్ణ, నాగరాజు, సుంకపాక నవీన్, బొడ్డు గంగ రాజు, పొత్తూరు జనార్దన్, మల్లే ష్, అజయ్, బూర సరిత ఉన్నారు.






