బ్రే క్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌కు భారీ విరాళం
- దివీస్ ల్యాబొరేటరీస్ 12.18 కోట్లు, అరబిందో ఫార్మా 10 కోట్లు
- సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో అందజేత
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌కు సీఎస్‌ఆర్ కింద దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థలు భారీ విరాళాలు ప్రకటించాయి. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌తో కలిసి చౌటుప్పల్, సంగారెడ్డిలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయడంతో పాటు కొడంగల్ కిచెన్‌ను ఆధునీకరించనున్నారు.
దివీస్ రూ.12.18 కోట్లు, అరబిందో ఫార్మా రూ.10 కోట్లు అందించగా, ఈ ప్రాజెక్టుల ద్వారా యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని మొత్తం 2,498 పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు 1.45 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహార బ్రేక్‌ఫాస్ట్ అందనుంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో దివీస్ వైస్ ప్రెసిడెంట్ మధుబాబు, అరబిందో ఫార్మా డైరెక్టర్ పి. శరత్ చంద్రరెడ్డి, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. నిత్యానందరెడ్డి చెక్కులను హెచ్‌కేఎంసీఎఫ్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీకి అందజేశారు.






