శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం చైర్మన్ గా అవధాని మోహన్ శర్మ
నూతన పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
మంథని,(విజయక్రాంతి): పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి నూతన పాలకవర్గ అధ్యక్షులుగా అవధాని మోహన్ శర్మ ను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మోహన్ శర్మ గతంలో 2015లో ఒక సంవత్సరం పాటు పాలక మండలి అధ్యక్షులుగా సేవలందించారు. అలాగే శ్రీ సరస్వతి పుష్కరాల సమయంలో 15-5-2015 నుండి 26-5-2025 వరకు పుష్కరాల కమిటీ అధ్యక్షులుగా సైతం సేవలందించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతి అంత్య పుష్కరాలకు మే 22-5-26 వరకు చైర్మన్ నియమించింది. గతంలో సంవత్సర కాలం మాత్రమే పాలకమండలి ఉండేది. అలాగే 2027 మేలో వచ్చే గోదావరి పుష్కరాల వరకు మోహన్ శర్మనే అధ్యక్షులుగా ఉంటారు. ప్రస్తుతం పాలకమండలి పరిమితిని రెండు సంవత్సరాలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా మోహన్ శర్మ మాట్లాడుతూ... స్వామివారి సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా తనకు స్వామి వారికి సేవ చేసే భాగ్యం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవాలయ శాఖ మంత్రి కొండ సురేఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గం సభ్యులుగా మంచినీళ్ల దుర్గయ్య, జలివంచ సీతారాం, సుంకరి సీతయ్య, గండెసిరి సత్యనారాయణ, కుంభం పద్మ, బీసుని నరసయ్య, అడ్డూరి శ్రీధర్ రావు, కాటం సత్యం, దొడ్ల అశోక్, దేవర శ్యాంసుందర్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.




