5 March, 2026 | 6:45 PM

ఆసుపత్రిలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు

05-03-2026 04:47 PM

 జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష 

సుల్తానాబాద్, మార్చి 5 (విజయ క్రాంతి): ఆసుపత్రి లో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దపల్లి  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  అన్నారు, గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఆసుపత్రి ఓపి సేవలను పరిశీలించి డెంటల్ ఓపి కు వస్తున్న కేసులు , అందిస్తున్న చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్ హెల్త్ చెక్ అప్ షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూడాలని, అవసరమైన వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.  రోగులతో ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రి కి వచ్చిన పేషంట్ లతో మాట్లాడారు.ఎన్.సి.డి విభాగం పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో మందుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి ఆర్.ఎం.ఓ, సిబ్బంది, పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

బీడీ కార్మికులకు పెన్షన్ పెంచాలి

కొనసాగుతున్న నాగులమ్మ జాతర

దినసరి కార్మికులకు కూలి రేట్లు పెంచాలి