కొత్త ప్రేక్షకులను పరిచయం చేసిన చిత్రమిది
19-05-2026 12:00 AM
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకుడు. నిధి ప్రదీప్ కథానాయికగా నటించింది. మే 8న రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. “మేం ఫేమస్’ సినిమాను యూత్ కనెక్ట్ చేసుకున్నారు.
ఈ సినిమా నాకు కొత్త ప్రేక్షకులను పరిచయం చేసింది” అన్నారు. ‘మాయ క్యారెక్టర్‌కు వస్తున్న స్పందన ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాన’ని హీరోయిన్ నిధి ప్రదీప్ తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుభాష్ చంద్ర, నిర్మాత అభినవ్ రావు, పలువరు చిత్రబృందం కూడా మాట్లాడారు.






