ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అరెస్టు
13-07-2026 03:41 PM
నిర్మల్, జులై 13 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖకు మంత్రి పదవి కేటాయించాలని సోమవారం చలో సీఎంకు వెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ పార్టీ జిల్లా నేతలు వినోద్ సాదిక్ లను సోమవారం ఉదయమే అదుపులో తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాలు ఆగమని తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.






