30 March, 2026 | 2:58 AM

మంత్రుల నియోజకవర్గాలకే నిధులా?

30-03-2026 01:10 AM
  1. నిధుల కోసం మేం సీఎం, మంత్రుల చుట్టూ తిరగాలా?

శాసనసభలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నా యని అన్నారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎ మ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కోసం మంత్రుల చు ట్టూ తిరగాలా? అని సీరియస్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు.. ప్రభుత్వం ఏం చేసినా ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని టాక్ ఉంద ని హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుం టున్నట్లు..

‘మేము మా నియోజకవర్గాలను అభివృ ద్ధి చేసుకోకూడదా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు.. లిప్టులన్నీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌కు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా తన సొంత నియోజకవర్గం మధిరకు అధికంగా నిధులు తీసుకుపోతున్నారని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రోడ్ల నిర్హహణలో ప్రభుత్వం తీసుకొచ్చిన హ్యామ్ విధానంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, నిర్ణయాలు, క్రమశిక్షణలో కరెక్ట్‌గా తీసుకుంటున్నారని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కితాబిచ్చారు. విద్యా, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృషి పెట్టాలని సూచించారు. విద్యకు దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో తక్కువగా కేటాయించిందని రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తెలంగాణ పబ్లిక్ స్కూ ల్స్ విధానం బాగుందని, నియోజకవర్గానికి ఒకటి కాకుండా మండలానికి ఒకటి చొప్పున ఇవ్వాలని కో రారు. అదే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక రోగులు తమ ఆస్తులను అమ్ముకుని చికిత్స కోసం ప్రయివేట్‌కే వెళ్లుతున్నారని చెప్పారు. డాక్టర్లు కూడా ప్రభుత్వ జీతం తీసుకుని ప్రయివేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి వివరించారు.