30 March, 2026 | 2:55 AM

అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

30-03-2026 01:09 AM

బెజ్జూర్, మార్చి 29 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కృష్ణపల్లి గ్రామంలో బెజ్జూర్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు రేంజ్ అధికారి ముసవీర్, డిప్యూటీ రేంజ్ అధికారి జే శ్రావణ్ కుమార్ తెలిపారు. బెజ్జూర్ రేంజ్ పరిధిలోని కృష్ణ పెళ్లి బీట్ పరిధిలో గల కృష్ణ పల్లి,తలాయి, ఇందిరిగాం, సుస్మిర్ గ్రామాల 200 మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు వైద్యాధికారి విద్యాసాగర్ తెలిపారు. ఈ వైద్య శిబిరం కాగజ్నగర్ విజేత హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి కార్తీక్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి సఫియా బేగం, ఫారెస్ట్ బీట్ అధికారులు వెంకటేష్, నాయకులు కుట్రంగి రామకృష్ణ, శ్రీనివాస్, శంకర్ పాల్గొన్నారు.