గల్లీ డాన్స్ ఢిల్లీకి చేర్చింది
నాగరాజుని సన్మానించిన యూత్ సభ్యులు
గరిడేపల్లి, మార్చి 29 : గల్లీలో డాన్స్ యువకుడ్ని ఢిల్లీకి చేర్చింది టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి నాగరాజు (అలియాస్ డాన్సర్ కాశీ) నిరూపించాడు వృత్తి రీత్యా పంచాయతీ కార్యదర్శి ప్రవృత్తి డాన్స్.పేదరికంలో జన్మించి, చిన్నప్పటి నుంచి అనేక కష్టానష్టాలను అనుభవించి, కష్టపడి చదువుకొని, నేడు సర్వారం గ్రామపంచాయతీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ,
విధులు నిర్వహిస్తూనే, చిన్నప్పటినుండి డాన్స్ పై ఉన్న విపరీతమైన ప్రేమని,ఇష్టాన్ని చంపుకోలేక, ఖుషి,పట్టుదల, అంకుటిత దీక్ష, వీటన్నిటికీ తోడు టాలెంట్ ఉంటే సాధించలేనిది ఏమీ లేదంటూ తన సత్తా చూపించారు.ఈనెల 20న ఢిల్లీ కేంద్రంలో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ -2026 తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొని జాతీయస్థాయిలో కాంపిటీషన్లో పోటీ పడగా మన తెలంగాణకు గ్రూప్ డాన్స్ లో తన వంతుగా ముఖ్య పాత్రను పోషించి తృతీయబహుమతిను సాదించడం జరిగింది అని ఆయన తెలిపారు.
గరిడేపల్లి గ్రామం నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరుకు మంచి డాన్స్ పెర్ఫామెన్స్ చేసి మన గరిడేపల్లి గ్రామ పేరుని వినిపించేటట్లు చేసినా కొత్తపల్లి నాగరాజు,వారి టీమ్ ని గరిడేపల్లి గ్రామ ప్రజలు అభినందించారు. ఇంకా భవిష్యత్తులో కూడా నాగరాజు అనేక డాన్స్ ఫర్ఫామెన్స్ లు చేసి, మంచి విజయాలు సాధించి,గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని,తను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం లో కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుతూ గరిడేపల్లి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలపడం జరిగింది.




