30 March, 2026 | 3:27 AM

మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్

30-03-2026 01:44 AM
  1. సమావేశాలు ముగిసే వరకు.. రెండురోజులు..
  2. ముందు గన్‌పార్క్ వద్ద.. తర్వాత స్పీకర్ పోడియం వద్ద బీఆర్‌ఎస్ నిరసన
  3. మంత్రి పొంగులేటిని బర్త్ఫ్ చేయాలని డిమాండ్
  4. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై విచారణ జరపాలంటూ నినాదాలు

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి) : బడ్జెట్ సమావేశాల సంద ర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శనివారం అసెంబ్లీలో మైనింగ్ పద్దు సందర్భం గా మొదలైన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మైనింగ్ అక్రమాల ఆరోపణలు సభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరి సస్పెన్షన్‌కు దారితీసింది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికు సంబంధించిన మైనింగ్ అక్రమాల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆ అంశాన్ని అసెంబ్లీ లో ప్రధాన అజెండాగా మార్చే ప్రయ త్నం చేశారు. ఆదివారం ఉదయం సభ ప్రారంభం కాగానే వెల్‌లోకి దూసుకొచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీక ర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు. మంత్రి పొంగులేటిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలి, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై విచారణ జరపాలం టూ నినాదాలు చేశారు. దీంతో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు.. కేటీఆర్, హరీష్‌రావు సహా బీఆర్‌ఎస్ సభ్యులంద రినీ సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వెంటనే తీర్మానాన్ని ఆమోందించి బీఆ ర్‌ఎస్ సభ్యులను ఈ సమావేశాలు ముగిసే వరకు.. రెండురోజులు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

గన్‌పార్క్ నుంచి.. స్పీకర్ పోడియం దాకా..

అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే ఆదివారం ఉదయం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా గన్‌పార్క్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటిని బర్త్ఫ్ చేయాలని, మైనింగ్ అక్రమాలను వెలికి తీసేందుకు హౌస్ కమిటీ వేయాలంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ కి చేరుకుని తమ నిరసనను మరింత తీవ్రత రం చేశారు.

నుంచి ప్రారంభమైన నిరసనలు, సభలో గందరగోళం, చివరకు ఎమ్మెల్యేల సస్పెన్షన్ వరకు దారితీసిన పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయాలని యత్నించగా మార్ష ల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ్యుల అరుపులు, నినా దాలతో సభా వాతావరణం పూర్తిగా ఉద్రిక్తం గా మారింది. దాదాపు అరగంటపాటు సభలో ఎలాంటి కార్యక్రమాలు కొనసాగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించాల్సిన సమయంలో సభను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

సభ్యులు తమ వైఖరిని మార్చుకుని బడ్జెట్ చర్చలకు సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ప్రతిపక్షాన్ని హెచ్చరించారు. అయినా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేస్తూ నిరసనను కొనసాగించారు. 

సస్పెండ్ చేసిన స్పీకర్..

ఈ క్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని సభా నిర్వహణకు ఆటంకం కలిగించినందుకు బీఆర్‌ఎస్ సభ్యులను రెండు రోజుల పాటు సస్పెం డ్ చేయాలని ప్రతిపాదించారు. దీనిపై వెంటనే స్పీకర్ స్పందించి ఈ సమావేశాలు ముగిసే వరకు బీఆర్‌ఎస్ సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

సస్పెన్షన్‌కు గురైన వారిలో.. కేటీఆర్, హరీష్‌రావు సహా తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశెడ్డి, కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్, కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, పద్మారావు, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, సబితారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, కే.పీ వివేకానంద్, అనిల్‌జాదవ్, లక్ష్మి ఉన్నారు.

స్పీకర్ ఆమోదంతో ఆ నిర్ణయం అమలులోకి రావడంతో సభలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సస్పెన్షన్ అనంతరం కూడా బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీ వెలుపల నిరసనలు కొనసాగిస్తూ, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయా లని, ‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ అక్రమాలపై స్వతం త్ర విచారణ జరపాలన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై వచ్చిన మైనింగ్ అక్రమా ల ఆరోపణలతో అసలు వివాదం మొదలైంది.

ఈ పరిణామాలు రాజకీయ ఉద్రిక్తతకు కేం ద్రంగా నిలిచాయి. ముఖ్యంగా ‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ పేరుతో జరిగిన పనుల్లో అవకతవక లు జరిగాయని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై హౌస్ కమిటీ లేదా న్యాయ విచారణ జరపాలని వారు పట్టుబడుతున్నారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.