30 March, 2026 | 2:20 AM

‘ఇందిరమ్మ’ పేరిట ఇష్టారాజ్యం!

30-03-2026 12:28 AM

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

అన్ని స్థాయిల అధికారులకు అమ్యామ్యా

సామాన్యునికి దొరకని ఇసుక

బాన్సువాడ, మార్చి 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు మండలం మంజీరా పరివాహక ప్రాంతం లో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. వందల ట్రిప్పుల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తూ దర్జాగా మూడు పూలు ఆరు కాయలుగా సంపాదిస్తున్నారు. ఎవరైనా అడ్డుకుంటే బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరిట సాగు చెబుతూ ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా ఇసుకను సరఫరా చేస్తూ దండుకుంటున్నారు అని ఆరోపణలు ఉన్నాయి.

బీర్కూర్ మండలంలో పనిచేస్తున్న ఒక్కొక్క అధికారికి ఒక్కొక్క వాటా ఇస్తున్నామని ట్రాక్టర్ల యజమానులు బాహాటంగానే చెబుతున్నారు. అంటే ఇదంతా అధికారుల కన్ను సన్నాల్లోనే జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. బీర్కూర్ మండలాల్లో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నారు ఎంత మేర ఇసుక అవసరం ఉందని ఇందిరమ్మ ఇండ్లు ఏ దశలో ఉన్నాయి అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అసలు వాస్తవాలు బహిర్గతం అవుతాయనీ సామాన్య ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కన్నెత్తి చూడాలని అక్రమ ఇసుక మాఫియా బర్తం పట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

వందల ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక రవాణా..

కొన్ని నెలలుగా వందల ట్రాక్టర్లు మంజీరా పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను కొల్లగొడుతూ డిడి ల పేరిట ప్రైవేటు వ్యక్తులకు భారీ డబ్బులు వేసి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయా శాఖల అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ బీర్కూర్ మండలంలో కొనసాగుతున్న చించోలి, కిష్టాపూర్ పాయింట్ల వద్ద కొందరు సిబ్బందిని నియమించి ఇప్పటికే వేల ట్రిప్పుల ఇసుకను పంపించారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక ట్రాక్టర్లు నడిపించే వారికి కొందరికి డ్రైవింగ్ లైసెన్స్ సైతం లేకపోవడం మరికొన్ని ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్లు లేకపోవడం గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా పట్టించుకునే నాధుడే కరువాయాడని ప్రజల ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వందల ట్రాక్టర్ల పై నిగా పెట్టి అక్రమ ఇసుక రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. 

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు..

మంజీరా పరివాహక ప్రాంతంలో ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. తనర్జనీ దేయంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా డబ్బులు దండుకునే విధంగా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇసుక మాఫియా ఆగడాలకు చెక్కు పెడితే తప్ప సామాన్య ప్రజల బాధలు తగ్గవని ప్రజలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా అక్రమంగా ఉష్క తరలిస్తూ ప్రమాదాలకు గురి అవుతున్న పట్టించుకోకపోవడం అధికారులు వత్తాసు పలకడంతో ఇసుక మాఫియా రోజురోజుకు జేబులు దండుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. 

మాఫియా ఆగడాలపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి మాఫియాకు వత్తాసు పలుకుతూ అక్రమ రవాణాకు దోహద పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారూ. పరిమితికి మించి అధిక స్పీడ్ తో ట్రాక్టర్లు ఒకేరోజు ఒకే వేబిల్లు పై పదుల సంఖ్యలో తరలిస్తున్నారు.గత కొన్ని నెలలుగా బీర్కూరు మండలంలో కొనసాగిన ఇసుక ట్రిప్పులను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అసలు డీడీలు తీసిన ఎన్ని ఏ అభివృద్ధి పనులకు ఇసుకను తరలించారు ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను వేశారు పూర్తిస్థాయిలో సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక టీం ద్వారా విచారణ చేపడితే అసలు బాగోతం సంబంధిత అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం అవుతుందనీ ప్రజలు అధికారులను కోరుతున్నారు. 

బీర్కూర్ లో ఓ అధికారి చేతివాటం.. మాఫియా కు వత్తాసు..

బీర్కూర్ మండలంలో ఓ అధికారి అన్ని తానే చేతివాటం ప్రదర్శిస్తూ ఇసుక మాఫియాకు వత్తాసు పలుకుతూ అక్రమ ఇసుక రవాణాకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు..ట్రాక్టర్ల యాజమాన్యాల సైతం ఒక యూనియన్ గా ఏర్పడి ఒక్కొక్క అధికారికి ఒక్కొక్క వాటా అంటూ తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు ఆయా శాఖల అధికారులకు పంచి పెడుతూ అక్రమ రవాణా కొనసాగించడం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు దర్జాగా ఇసుకను పంపిస్తూ డీడీలు తీసిన వారికి రోజుల తరబడి కార్యాలయాలు చుట్టూ తెంపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

బీర్కూరు మండలంలో ఓ అధికారి అన్ని తానే వ్యవహరిస్తూ సంబంధిత అధికారులు మజ్జిగ చేసుకుని పూర్తి స్థాయిలో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు ఇసుకపై యాజమానిసిచెలాయిస్తున్నారని సమాచారం. డీడీలు రాసే వారికి సైతం డాక్టర్ల యజమానుల నుంచి కొంతమేర ప్రతిరోజు చెల్లిస్తూ తమకు అనుకూలంగా డీడీలు రాయించుకొని ప్రైవేటు వ్యక్తులకు ఇసుక డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. బీర్కూరు మండలంలో జరుగుతున్న ఇసుకతంతుపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సామాన్య ప్రజలకు ఇసుక కొరత..

ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక మాఫియా మంజీరా పర్యాత ప్రాంతం నుండి ఒకే వేబిళ్ళు పై అక్రమసిక రవాణా చేస్తూ సామాన్యునికి ఇసుక కావాలంటే కొరత ఉందని సృష్టిస్తూ వేల రూపాయలు అధిక వసూలు చేస్తూ సామాన్య ప్రజలపై పిండి దండుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.  అదే ప్రైవేట్ వ్యక్తులకు వందల ట్రిప్పులు డంపింగ్లు చేసుకోవడానికి అధికారులు ఎలాంటి అనుమతులు అడగడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

బీర్కూరు మండలంలో ఈ తంతు గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంబంధిత ఉన్నతాధికారులు ఇటువైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదని పలు విమర్శలకు తావిస్తుంది.  బాధ్యులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదను అర్థం కావడం లేదని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. మంజీరా పరివాహక ప్రాంతం నుంచి సహజ సంపాదన కొల్లగొడుతూ అవసరానికి మించి డిడి ల పేరిట అక్రమ ఇసుకను పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏ శాఖల అధికారులకు ఎంతెంత వాటా ఉందో పూర్తి స్థాయిలో బయటపెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఫోన్‌కు స్పందించని బీర్కూర్  తహసిల్దార్..

బీర్కూరు మంజీరా పరివాహక ప్రాంతం నుండి అక్రమ ఇసుక రవాణా ఇసుక మాఫియా ఆగడాలపై విజయక్రాంతి వివరణ కోరెందుకు బీర్కూర్ తహసిల్దార్ సవాయిసింగ్ కు ఫోను చేయగా ఫోను ఎత్తకపోవడం స్పందించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న వేల్పూర్ తాసిల్దార్ అటువైపు కన్నీటి చూడకపోవడం పట్ల మాఫియాకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా బీర్కూర్ తహసిల్దార్ చొరవ తీసుకొని అక్రమ రవాణాను అరికట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.