30 March, 2026 | 3:27 AM

రుణమాఫీ చేయాలని రైతుల నిరసన

30-03-2026 02:18 AM

బ్యాంక్ అధికారుల తప్పిదంతో నష్టపోయామని ఆవేదన

నల్లగొండ టౌన్, మార్చి 29 : తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ అధికారుల తప్పిదంతో నష్టపోయిన రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆదివారం నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్ -ఖాజీ రామారం రైతు వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా నష్టపోయిన 300 మంది సమీప గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీజీవీబీ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గా రూపాంతరం చెందడంతో ఐఎఫ్‌ఎస్సి కోడ్ మిస్ మ్యాచ్ కారణంగా అర్హత ఉండి బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం తో రుణమాపి కాకుండా ఆర్థికంగా నష్టపోయామని రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

జనవరి 1, 2025 న ఏపీజీవీబీ బ్యాంకు టీజీజీవీబీ గా మారినప్పటికి జనవరి 18 న నాలుగో విడత రేషన్ కార్డు లేని రైతులకు రుణమాపీ క్లియర్ చేసిందన్నారు. అయితే బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె నష్టపోయామని కావున సమస్యను పరిష్కరించి తమకు రుణమాఫీ వర్తింపజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధిత రైతులు పాల్గొన్నారు.