30 March, 2026 | 2:58 AM

బాటిలింగ్ డిపోను పునరుద్ధరించాలి

30-03-2026 01:11 AM

ఉట్నూర్, మార్చి 29 (విజయక్రాంతి): ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్ వద్ద ఉమ్మడి ప్రభు త్వ హాయంలో ఏర్పాటు చేసిన ఎక్సైజ్ శాఖ బాటిలింగ్ కేంద్రాన్ని  ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆదివారం ఉట్నూర్ క్రాస్ రోడ్ వద్ద పోరాట సమితి నాయకులతో కలిసి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  భరత్ చౌహాన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

దీంతో కాసేపు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా భారత్ చౌహాన్ మాట్లాడుతూ... గతంలో ఉట్నూరు లోని బాటిలింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరగడంతో జిల్లా కేంద్రానికి తరలించాలన్నారు. వెంటనే అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న భవనం కు మరమ్మతులు చేయించి, పున:ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రారంభించక పోతే లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో నాయకులు అలింధర్ చవాన్, రాథోడ్ ధర్మానాయక్, రాథోడ్ ప్రేమ్ కుమార్, జాదవ్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.