దోమకొండకు రెగ్యులర్ ఏఈ నియామకం..బాలుర పాఠశాలకు ఎన్‌సీసీ సెంటర్ ఏర్పాటు చేయాలి
దోమకొండ, జూలై 10 (విజయ క్రాంతి): దోమకొండ విద్యుత్ శాఖకు పూర్తిస్థాయి అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)ను నియమించ డంతో పాటు, జడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ (నేషనల్ క్యాడెట్ కారప్స్) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దోమకొండ గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కు శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నర్సయ్య మాట్లాడుతూ, పాత తాలూకా కేంద్రమైన దోమకొండ లో ప్రస్తుతం విద్యుత్ శాఖ ఏఈ గా ఇన్చార్జి అధికారి మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతో విద్యుత్ సంబంధిత సమస్యలు సకాలంలో పరిష్కా రం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దోమకొండ కు పూర్తిస్థాయి రెగ్యులర్ ఏఈ ని నియమించాలని కోరారు.
అదేవిధంగా, దోమకొండ జడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో ఎన్సీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఎన్సీసీ ఏర్పాటు వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందడం తో పాటు రక్షణ రంగం సహా వివిధ ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుందని వివరించారు. వినతి పై స్పందించిన ప్రభుత్వ సలహాదారు , విద్యుత్ శాఖ సీఎండీ వరుణ్ రెడ్డితో మాట్లాడి వారం రోజుల్లో దోమకొండ కు రెగ్యులర్ ఏఈ నియామకానికి చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.
అలాగే 12వ బెటాలి యన్ డిచ్పల్లి కమాండెంట్ తో మాట్లాడి దోమకొండ బాలుర పాఠశాలకు ఎన్ సీ సీ కేంద్రం మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వెల్లడించా రు. మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, మండల అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు అనంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మధు, నల్లపు శ్రీనివాస్, షమ్మీ, సిద్ధరాములు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.






