11 July, 2026 | 3:06 AM

నేడు ఐవీవై, సిద్ధార్థ విద్యాసంస్థల ఆధ్వర్యంలో రోబోటిక్, ఏఐ ఎక్స్‌పో

11-07-2026 01:04 AM

ముకరంపుర, జూలై 10 (విజయక్రాంతి): నగరంలోని సీతారాంపూర్ లోని  ఐవివై, సిద్ధార్థ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 11న విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక నైపుణ్యాలు, పరిశోధనా ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో  బ్రావ్ ఏఐ వారు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎక్స్ పో ను నిర్వహించనున్నారు.

ఐవివై విద్యాసంస్థల చైర్మన్ పసుల మహేష్, కో చైర్మెన్ దాసరి శ్రీ పాల్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు చిన్న వయస్సు నుంచే అలవర్చుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ ఎక్స్పోలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ టెక్నాలజీలకు సంబంధించిన వినూత్న ప్రాజెక్టులు, ప్రత్యక్ష ప్రదర్శనలు, విద్యార్థుల ఆవిష్కరణలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఎక్స్ పో కు హాజరై విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు.