డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
04-05-2026 03:39 PM
హైదరాబాద్: జవహర్ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. డంపింగ్ యార్డును జవహర్ నగర్ నుంచి తరలించాలని విజ్ఞప్తి చేసి వినతిపత్రం సమర్పించారు. లోక్‌సభ సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, యాంటీ డంపింగ్ యార్డ్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బి. శంకర్ నారాయణ, స్థానిక నాయకులు తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో పాటు జేఏసీ ఇతర ప్రతినిధులు ఉన్నారు.






