calender_icon.png 19 February, 2026 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపుతప్పి గుంతలో పడిన ఏపీ ఆర్టీసీ బస్సు !

19-02-2026 12:48:53 PM

20 మంది ప్రయాణికులకు గాయాలు 

గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు శివారులో ఘటన 

అలంపూర్: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు శివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున 4 గంటలకు చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ప్రమాదానికి సంబంధించి వివరాలు .. ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు శివారులో జాతీయ రహదారిపై అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అంబులెన్స్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మూడు అంబులెన్సులలో కర్నూల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..