11 May, 2026 | 11:56 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

శాంతివనానికి చంద్రబాబు

15-12-2025 08:23 AM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) సోమవారం నాడు శంషాబాద్ లోని కన్హా శాంతివనంలో(Kanha Shanti Vanam) పర్యటించనున్నారు. కన్హా శాంతివనం అధ్యక్షుడు దాజీతో చంద్రబాబు భేటీ కానున్నారు. వెల్ నెస్, మెడిటేషన్ సెంటర్, యోగా కేంద్రాలను ఆయన తిలకించనున్నారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్,  మెడిటేషన్ సెంటర్, బయోవార్ కేంద్రాలు, గోపీచంద్ స్టేడియం, హార్టిఫుల్ నెస్ స్కూల్ కేంద్రాలను చంద్రబాబు సందర్శించనున్నారు. అనంతరం శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తిరిగి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు,