19 May, 2026 | 10:04 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలి: చిలువేరు అంజయ్య

31-10-2025 11:55 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో ఎఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏఐటియుసి మండల ప్రధాన కార్యదర్శి చిలువేరు అంజయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కార్మికుల పక్షాన ఎఐటియుసి నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్మికులకు వేతన గిట్టుబాటు ఏఐటియుసి కృషి వలన సాధ్యమైందన్నారు. భవన కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్గ్రేషియా చెల్లించడం మొదటి విజయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలని కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.