16 May, 2026 | 8:46 PM

ఖానాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షుల ప్రకటన

16-05-2026 08:04 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షుల జాబితా ఎట్టకేలకు ప్రకటించారు. మేరకు శనివారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఖానాపూర్ నియోజకవర్గం లోని ఐదు మండలాలకు మండల పట్టణ అధ్యక్షులను ఖరారు చేస్తు జాబితా ప్రకటన విడుదల చేశారు.

ఖానాపూర్ మండలం అధ్యక్షులుగా జంగిలి శంకర్, పట్టణ అధ్యక్షులుగా గొర్రె గంగాధర్, కడెం మండలం అధ్యక్షులుగా బొడ్డు గంగన్న, పట్టణ అధ్యక్షులుగా ఎండి వాజిద్, దస్తురాబాద్ మండలం అధ్యక్షులుగా ఆర్ రమేష్ రావు, పెంబి మండల అధ్యక్షులుగా గుడిసె రమేష్, పట్టణ అధ్యక్షులుగా గుగ్గిల భూమేష్, జన్నారం మండలం అధ్యక్షులుగా ఏ నందు నాయక్ ,పట్టణ అధ్యక్షులుగా మంద రాజేష్ లను నియమిస్తూ టిపిసిసి ఉత్తర్వులు జారీ చేసింది. నియమించబడిన అధ్యక్షులను స్థానిక ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్ అభినందించారు.