ఆత్మలింగేశ్వర అభివృద్ధికి విరాళం అందజేత
16-05-2026 08:01 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో గల ఆత్మలింగేశ్వర దేవాలయం అభివృద్ధి కోసం టిఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ అందించినటు వంటి 25 వేల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగిందని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీగారి సుభాన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాయకులు గౌరీగారి సుభాన్ రెడ్డి, నాయకులు బాగారెడ్డి, జనరల్ సెక్రెటరీ ఖలీల్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, మండల మహిళా అధ్యక్షురాలు పద్మ,మండల యువజన అధ్యక్షులు పాహిము,మండల పద్మశాలి అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, సిద్ది రాములు శారద ఉన్నారు.






