9 April, 2026 | 2:01 AM

అనుమతి ఒకలా.. నిర్మాణం మరోలా!

09-04-2026 12:00 AM
  1. గ్రామ కంఠంలో అక్రమ నిర్మాణం
  2. కాగితలకే పరిమితమైన టౌన్ ప్లానింగ్ చర్యలు
  3. నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్న వైనం
  4. నిజాంపేట్‌లో చర్చనీయంశంగా మారిన ఓ అక్రమ నిర్మాణం

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని అక్ర మార్కులు రెచ్చిపోతున్నారు. గ్రామ కంఠం పరిధిలో నిబంధనలను తుంగలో తొక్కుతూ చేపట్టిన ఓ అక్రమ నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. నిజాంపేట్ పూర్వ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో గల గ్రామ కంఠం, నాన్ అప్రూవల్ లేఔట్ స్థలంలో ఓ బిల్డర్ జీ+5 అనుమతులు తీసుకున్నాడు. ఈ అనుమతి కోసం కనీసం 40 ఫీట్ల రోడ్డు ఉండాలి.

కానీ కేవలం 15 ఫీట్ల రోడ్డు ఉండడంతో టౌన్ ప్లానింగ్ నుండి అనుమతులు వచ్చే అవకాశం లేదు.టౌన్ ప్లానింగ్ అధికారు లు సదరు బిల్డర్‌కు లొంగిపో యి అనుమతులు జారీ చేశారని స్థానికుల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి. కనీ ం సెట్ బ్యాక్ లేకుండా, అక్రమంగా సెల్లార్ తో కూడిన అక్రమ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్పా అక్రమ నిర్మాణం పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

కాగితలకే పరితమైన టౌన్ ప్లానింగ్ చర్యలు

ఈ అక్రమ నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో స్థానికులు టౌన్ ప్లానింగ్ చర్యలు కాగితలకే పరి మితమయ్యాయని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సదరు అక్రమ నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద ని వివరణ  కోరగా నోటీసులతోపాటు స్పీకింగ్ ఆర్డర్స్ కూడా జారీ చేశామని తెలిపారు. అయినా సరే సదరు బిల్డర్ కేర్ చెయ్యడం లేదని తెలిపారు.

అయితే నోటీసులు జారీ చేసినప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులకు నిర్మాణపనులు నిలిపివేయడం, అక్రమ నిర్మాణ భాగాలను కూల్చివేసే హక్కు కలిగి ఉంటుంది. కానీ అక్రమ నిర్మాణం పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇదంతా చూస్తే అక్రమ నిర్మాణదారులకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంత లా సహకరిస్తున్నారో  స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి కైనా జోనల్ కమిషనర్  స్పందించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అక్రమ నిర్మాణంపై, నిర్మాణానికి సహకరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకుని, బిల్డర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

జీరో సెట్ బ్యాక్... అక్రమంగా సెల్లార్ నిర్మాణం

అయితే సెల్లార్ నిర్మాణం చేపట్టాలంటే వెయ్యి చదరపు గజాల స్థలం కలిగి ఉండాలి. దీంతో పాటు 40 ఫీట్ల రోడ్డు సౌకర్యం కలిగి ఉండాలి. కానీ 15 ఫీట్ల రోడ్డు పై నిబంధనలను ఉల్లంగిస్తూ సెట్ బ్యాక్ లేకుండా, అక్రమ సెల్లార్ నిర్మాణం కొనసాగుతుంది. నివాసం కొరకు తీసుకున్న బిల్డింగ్ అనుమతులను, షెటర్స్ వేస్తూ కమర్షియల్ గా మారుస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నాడు బిల్డర్. నివాసం కోసం తీసుకున్న భవనాన్ని కమర్షియల్ గా నిర్మాణం చేపట్టాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. కానీ సదరు బిల్డర్ నిబంధనలను కాలరాస్తూ ధర్జాగా షెటర్స్ నిర్మిస్తున్నాడు.