calender_icon.png 11 February, 2026 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శంగా నిలిచిన అంబేడ్కర్ యూత్ అసోసియేషన్

11-02-2026 12:30:49 AM

మృతి చెందిన అంగన్వాడీ టీచర్ చిట్టెమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం

పెద్దమందడి ఫిబ్రవరి 10 : పెద్దమందడి మండల కేంద్రంలో స్థానిక అంగన్వాడీ టీచ ర్ చిట్టెమ్మ ఆకస్మిక మృతి వారి కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండగా, అంబేడ్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి తమ వంతు సహాయంగా రూ. 20 వేల నగదును సేకరించి,

బాధిత కుటుంబ సభ్యులకు అందజే శారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా యువత నిరూపించారు. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చేసిన ఈ సాయాన్ని గ్రామస్తులు మరియు పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, పెద్దలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.