11-02-2026 12:29:37 AM
రాజాపూర్ ఫిబ్రవరి 10: మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో మంగళవారం శివ స్వాములు ఇరుముడుల పూజ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 41 రోజులు శివ దీక్ష స్వీకరించిన స్వాములు గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో బొడ్ల విజయ్ కుమార్ గురు స్వామి ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల పడిపూజ నిర్వహించారు. 12 జ్యోతిర్లిం గాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఇరుముడి పూజకు నిర్వహించారు. ఈ వేడుకలకు వివిధ గ్రామాల శివ స్వాములు భక్తు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో శివనామస్మరణతో వీధులన్నీ మారుమోగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈకార్యక్రమంలో గురు స్వా ములు బొడ్ల శివకుమార్, దాసమోని కృష్ణ య్య, కావాలి విష్ణు, గ్రామ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్ డిప్యూటీ సర్పంచ్ రామచందర్,గురు స్వాములు రవి నాయక్, నరసింహ, మైబు, ఆంజనేయులు,తిరుపతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.