15 April, 2026 | 2:38 AM

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి

14-04-2026 08:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు. ఎన్టీఆర్ ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కోఆర్డినేటర్ కె రామ్ కిషన్ రెడ్డి, మాజీ జెడ్పి చైర్మన్ మూలం శ్యాంసుందర్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము, స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.