అధికారులు ఇంటి నుంచి గెంటేశారు..!
దివ్యాంగ వృద్ధురాలి ఆవేదన.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): తాము నివాసం ఉంటున్న ఇంటిని కాళీ చేయించి తమను ఇరిగేషన్ శాఖ అధికారులు బయటికి గెంటేసారని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతూ సోమవారం ఓ వృద్ధ దివ్యాంగురాలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాద్ మండలం దోమల పెంట (బ్రహ్మగిరి) గ్రామానికి చెందిన కె. సంతోషఅమ్మ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయం 2007లో బలహీన వర్గానికి చెందిన దివ్యాంగురాలిగా గుర్తించి అప్పటి కలెక్టర్ నివాసం ఉండేందుకు పాడుబడిన ఇంటిని కేటాయించారు. అందులో రిపేరు చేసుకుని తాను తన భర్త ఇద్దరు ఆడబిడ్డలతో నివసిస్తూ జీవనం గడుపుతున్న క్రమంలో ప్రస్తుతం ఏ-7- 13 బ్లాక్ ఇంటిని ఇరిగేషన్ శాఖ అధికారులు జప్తు చేస్తూ నోటీసులు ఇచ్చారని అందుకు గల ఆధారాలను పొందుపరిచినా వినకుండా తమను ఇంటి నుంచి బయటకు గెంటేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చాము నివాసము ఉండేందుకు ప్రభుత్వం సొంత ఇంటిని ఏర్పాటు చేయాలని కోరారు






